నిర్మల్ జిల్లా కేంద్రంలోని బేస్తవారిపేట్ కాలనీ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా తోట రమేష్, ఉపాధ్యక్షులుగా ఆకుల అశోక్, ప్రధాన కార్యదర్శిగా గుమ్ముల అశోక్, కోశాధికారిగా తోట రవి, కార్యనిర్వాహక అధికారిగా తోట రమేష్ లు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు. సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు.