నిర్మల్ పట్టణం పర్యావరణ పరిరక్షణలో భాగంగా శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పర్యావరణ పరిరక్షణ చేయాలి అనే కార్యక్రమాన్ని బోటనీ విభాగం వారు చేశారు. విద్యార్థులు మట్టితో గణపతులు తయారు చేశారు. ఉచిత పంపిణి చేస్తారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా ఎం సుధాకర్, పవన్ కుమార్ ( బొటని ప్రతినిధి ), అర్చన, ఏవి రెడ్డి, నరేంద్ర, రవీంధర్, శ్రీనివాస్, డా రంజిత్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.