నిర్మల్ జిల్లా కేంద్రంలో శ్రీ గాయత్రి గోశాల ఆధ్వర్యంలో గోమయ రాఖీలు తయారు చేశారు. ప్రవీణ్ శర్మ మాట్లాడుతూ గోమయ రాఖీలు ధరించి గోవులను రక్షించాలని అన్నారు. ప్రతి ఒక్కరు రాఖీలను ధరించిన తర్వాత మరుసటి రోజు వాటిని పువ్వుల తోట్టెలో వేసినట్లయితే మొక్కలు వస్తాయని అన్నారు, గోమయ రాఖీలు బస్సు డిపో దక్షిణముఖి హనుమాన్ ఆలయం ప్రక్కన విక్రయించడం జరుగుతుందని రాఖీలను కొనుగోలు చేయాలని కోరారు.