సారంగాపూర్ లో చెట్లు కూలి రాకపోకలకు అంతరాయం

71చూసినవారు
సోమవారం అర్ధరాత్రి నుండి కురిసిన భారీ వర్షాలు, ఈదురుగాలులకు ప్రధాన రహదారిపై పలు చెట్లు నేల కూలాయి. సారంగాపూర్ మండలం బీరవెల్లి నుండి కాల్వ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై చెట్లు పడడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. స్థానికులు, గ్రామపంచాయతీ సిబ్బంది చెట్లను రోడ్లపై నుంచి పక్కకు నెట్టారు. పలు కాలనీలు వర్షపు నీళ్లతో నిండి నడవలేని దుస్థితికి చేరుకున్నాయి.

సంబంధిత పోస్ట్