నాగదేవత ఆలయ పునర్నిర్మాణానికి రూ. 40 లక్షలు మంజూరు

58చూసినవారు
నాగదేవత ఆలయ పునర్నిర్మాణానికి రూ. 40 లక్షలు మంజూరు
మామడ మండలం పొన్కల్ గ్రామంలోని శ్రీ నాగదేవత హనుమాన్ ఆలయాల పునర్నిర్మాణానికి రూ. 40 లక్షలు మంజూరయ్యాయని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. గ్రామ సమీపంలోని సదర్మట్ బ్యారేజీ నిర్మాణంతో ఆలయం ముంపుకు గురవుతుందని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో దేవాదాయశాఖ కమిషనర్ తో మాట్లాడి నిధులు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. త్వరలోనే ఆలయ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్