డీఎస్ మరణం పట్ల సంతాపం తెలిపిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

60చూసినవారు
డీఎస్ మరణం పట్ల సంతాపం తెలిపిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శనివారం సంతాపం తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఆయన అంచెలంచెలుగా ఎదిగారని, మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా ప్రజలకు, పార్టీకి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. డి. శ్రీనివాస్ తో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.