బాసర జ్ఞాన సరస్వతి దేవిని దర్శించిన ముధోల్ మాజీ ఎమ్మెల్యే
ప్రసిద్ధ జ్ఞాన సరస్వతి పుణ్యక్షేత్రాన్ని వసంత పంచమిని పురస్కరించుకొని సోమవారం ముధోల్ మాజీ శాసనసభ్యులు విట్టల్ రెడ్డి పూజలు చేశారు. ఆయనతోపాటు బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్, నాయకులు ఆలయానికి చేరుకుగా.. వేద పండితులు స్వాగతం పలికి పూలమాలలు వేసి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.