నిర్మల్ లో యథేచ్ఛగా మద్యం విక్రయాలు

61చూసినవారు
నిర్మల్ లో యథేచ్ఛగా మద్యం విక్రయాలు
స్వాతంత్ర దినోత్సవం రోజు మద్యం అమ్మకాలను నిషేధించడమే కాకుండా డ్రైడేగా పాటించాలనే నిబంధన ఉన్నా మద్యం అమ్మకాలు యథేచ్ఛగా సాగాయి. గురువారం జిల్లా కేంద్రంలోని తిరుమల బార్ అండ్ రెస్టారెంట్ వెనకాల నుండి మద్యం విక్రయించారు. అక్కడే ఓపెన్ బార్ లో మద్యం ప్రియులు దర్జాగా సేవించారు. బార్ కు కూతవేటు దూరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో పంద్రాగస్టు వేడుకలు జరుగుతున్న అవేమీ పట్టించుకోకుండా మద్యం విక్రయించడం కొసమెరుపు.

సంబంధిత పోస్ట్