ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 200 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి చేరినట్లు గురువారం రాత్రి 8. 30 గంటలకు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 358. 70 మీటర్లు కాగా, ప్రస్తుత నీటి మట్టం 358. 70 కు చేరగా ఒక గేటు ద్వారా 1, 194క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదులుతున్నట్లు తెలిపారు.