వైభవంగా శ్రీ దత్త సాయి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం

65చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గండి రామన్న దత్త సాయి దేవాలయంలో శ్రీ దత్త సాయి రెండవ వార్షికోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. బాబాకు ఉదయం ప్రత్యేక పూజ కార్యక్రమాలు, అభిషేకాలు చేపట్టారు. మధ్యాహ్నం దేవతా హోమము, సూక్త మూలమంత్ర హోమము, పూర్ణాహుతి హారతి కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో బాబాను దర్శించుకున్నారు. ఇందులో సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్