ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సారంగా పూర్ మండలం జామ్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. వంట గదిని పరిశీలించి, పరిశుభ్రతను పాటించాలని నాణ్యమైన కూరగాయలను వినియోగించాలని సిబ్బందికి సూచించారు. ఇందులో డీఈఓ రవీందర్ రెడ్డి ఉన్నారు.