దత్త సాయి ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

869చూసినవారు
దత్త సాయి ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ గండి రామన్న దత్త సాయి ఆలయంలో గురుపౌర్ణిమ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. భక్తులు 48 గంటల సాయి పారాయణాన్ని చేపట్టారు. నిర్మల్ జిల్లా కేంద్రం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్