పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ బాధితుడికి అప్పగింత

54చూసినవారు
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ బాధితుడికి అప్పగింత
నిర్మల్ జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్ లో గురువారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న బ్లూ కోర్టు సిబ్బంది రాథోడ్ అనిల్, గణేష్, పెట్రో కార్ సిబ్బంది తిలక్, భాస్కర్ కు మొబైల్ ఫోన్ దొరికింది. బాధితుడు దేవేందర్ మొబైల్ ఫోన్ కు కాల్ చేసి తన ఫోను పోయిందని తెలిపాడు. వెంటనే అతని వివరాలు తెలుసుకొని మొబైల్ ఫోన్ అప్పగించారు. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు.

సంబంధిత పోస్ట్