నిర్మల్ లో భారీ వర్షం, జలమయమైన రోడ్లు

72చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఏకదాటిగా కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. స్థానిక గాంధీ కూరగాయల మార్కెట్ లో మొకాళ్ళ ఎత్తులో రోడ్లపై వర్షపు నీరు ప్రవహించడంతో కూరగాయల విక్రయదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గత వారం రోజులుగా వర్షం లేక తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ ప్రజలు ఈ వర్షానికి కొద్దిపాటి ఉపశమనం పొందారు.

సంబంధిత పోస్ట్