గల్ఫ్ బాధితులకు సహాయం కోసం నిర్మల్‌లో హెల్ప్ లైన్: కలెక్టర్
గల్ఫ్ బాధితులకు సహాయాన్ని అందించేందుకై జిల్లాలో హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గల్ఫ్ బాధితుల కోసం, వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదులు చేసేందుకు జిల్లాలో హెల్ప్ లైన్ నంబర్ ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.