రేపటి నుండి జిల్లాలో పోలీస్ 30 యాక్ట్ అమలు

81చూసినవారు
రేపటి నుండి జిల్లాలో పోలీస్ 30 యాక్ట్ అమలు
నిర్మల్ జిల్లాలో శాంతి భద్రతలను కాపాడడానికి జూలై నెలాఖరు వరకు 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని ఎస్పీ జానకి షర్మిల ఆదివారం తెలిపారు. డివిజనల్‌ పోలీసు అధికారి అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని హెచ్చరించారు. శాంతికి భంగం కల్గించడం, పబ్లిక్‌ స్థలాల్లో డీజేలు, మ్యూజిక్‌లు, ప్రసంగాలు నిషేధమని, ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు గమనించి పోలీసులకు సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్