నిర్మల్ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడి పోతుండటంతో చలి ప్రభావ వ్యాధులు విజృంభిస్తున్నాయి. గడిచిన 24 గంటలలో జిల్లాలోని కనిష్టంగా పెంబి మండలంలో 10. 9, గరిష్టంగా దిలావర్పూర్ మండలంలో 17. 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో చిన్నారులు, వయోవృద్ధులు సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచించారు.