నిర్మల్ జిల్లా కేంద్రంలో డిసిసి క్యాంప్ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అనంతరం మాట్లాడుతూ దేశ స్వాతంత్య్ర కోసం ఎంతో మంది మహనీయులు పోరాడారని అన్నారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకున్నారు. అనంతరం జిల్లా ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.