నిర్మల్ లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రం పరిశీలన
నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలోని శాసనమండలి ఎన్నికల కేంద్రాన్ని గురువారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఎన్నికల నిర్వహణపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన వసతులను, పోలీసు బందోబస్తును ఆయన పరిశీలించారు. ఎప్పటికప్పుడు పోలింగ్ శాతపు వివరాలను నమోదు చేసి అధికారులకు అందజేయాలన్నారు. .