వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి

51చూసినవారు
వర్షాకాలంలో నిర్మల్ పట్టణంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అధ్యక్షతన శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎజెండాలోని అంశాలను చర్చించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడకుండా అవగాహన కల్పించాలని సూచించారు. పట్టణంలో ప్రజలపై కోతులు, కుక్కల దాడుల చేయకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.