సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో సర్వీస్ రోడ్డు విషయమై డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావుని ఆదివారం గ్రామస్తులు కలుసుకున్నారు. 44వ జాతీయ రహదారి వెడల్పులో గ్రామంలో ఫ్లై ఓవర్ నిర్మించారని, దీంతో సర్వీస్ రోడ్డు లేకుండా రహదారిని ఏర్పాటు చేశారని వాపోయారు. గతంలో ఉన్న సర్వీస్ రోడ్డును రహదారిలో కలపడం వలన గ్రామస్తులకు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.