ఖానాపూర్: పోలీస్ స్టేషన్ ముందర బీఆర్ఎస్ నేతల ఆందోళన

64చూసినవారు
ఖానాపూర్: పోలీస్ స్టేషన్ ముందర బీఆర్ఎస్ నేతల ఆందోళన
బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ కొంతం దిలీప్ అరెస్టును నిరసిస్తూ బుధవారం ఖానాపూర్ లో నాయకులు నిరసన చేపట్టారు. నియోజకవర్గం ఇన్‌చార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ ఆదేశాలతో ఆందోళన చేపట్టామన్నారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ప్రశ్నించే స్వరాలను అణచివేయడం శోచనీయమన్నారు. ప్రశ్నిస్తే కేసులు నిలదీస్తే అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు. దిలీప్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్