తెలంగాణ ఆడపడుచులకు మాజీ మంత్రి కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. మహిళలపై కేటీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయనపై చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే ఓర్చుకోలేని కేటీఆర్ మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాని పేర్కొన్నారు.