కుబీర్: మిషన్ భగీరథ నీరు రావడం లేదు
కుబీర్ మండలంలోని బెల్గాం తాండ 2లో గత మూడు రోజుల నుండి మిషన్ భగీరథ నీరు రావడం లేదు. స్థానిక గ్రామపంచాయతీ కార్యదర్శి ముజాహిద్ స్పందించి ప్రైవేట్ బోరు నుంచి పంచాయతీ వాటర్ ట్యాంకర్ ద్వారా నీరు అందించి ప్రజల దాహార్తి తీర్చారు. వారు మాట్లాడుతూ మిషన్ భగీరథ మోటర్ చెడిపోవడం వలన నీరు రాలేకపోయాయని చెప్పారు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని త్వరలో రిపేర్ చేయిస్తామని తెలిపారు.