పట్టణంలోని NTR మినిస్టేడియంలో స్వచ్చభారత్ కార్యక్రమం మంగళవారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సుర్గుల శ్రీనివాస్ మాట్లాడుతూ దేశ ప్రజలు అందరు కూడా పరిసరాలను కాపాడుకోవల్సిన భాద్యత అందరిపై ఉందన్నారు. అందరు క్రమం తప్పకుండా, విధిగా మన పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని మనదేశం మన భద్రత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువకులు ఆకాష్, సురేష్, షాదాబ్, నాగరాజు, సాగర్ తదితరులు పాల్గొన్నారు.