లక్ష్మణ్ చాంద: అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు ఎన్నిక
మాదిగల అంబేద్కర్ సంఘం లక్ష్మణ్ చాంద మండల అధ్యక్షునిగా బొమ్మెన మధును నియమించినట్లు ఆ సంఘం అసెంబ్లీ అధ్యక్షులు సుంకేట దశరథ్, జిల్లా అధ్యక్షులు అడిగా లక్ష్మణ్ లు సోమవారం తెలిపారు. చామన్ పెల్లికు చెందిన మధు మాదిగల హక్కుల సాధన సమస్యల పరిష్కారం కోసం నిత్య పోరాటాలు చేస్తున్నారన్నారు. మండలంలోని అన్ని గ్రామాలలో కమిటీలు వేయాలని సూచించారు. ఎస్సీల వర్గీకరణకు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు.