మామడ మండలం కప్పన్ పల్లి గ్రామానికి చెందిన మహిళలు అటవీ ప్రాంతంలో తునికాకు సేకరణకు వెళ్లి గురువారం తప్పిపోయారు. రాత్రంతా అటవీ ప్రాంతంలోనే ఉండిపోయారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో శుక్రవారం మహిళలను క్షేమంగా ఇంటికి తీసుకువచ్చి వారి కుటుంబీకులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు మహిళల నివాసానికి వెళ్లి పరామర్శించారు.