నిర్మల్‌లో గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

69చూసినవారు
నిర్మల్‌లో గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్
నిర్మల్ జిల్లాలో గురువారం గంజాయి రవాణా చేస్తున్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. రూరల్ ఎస్ఐ జి. లింబాద్రికి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు, కొండాపూర్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా కడం వైపు నుండి నిర్మల్ వస్తున్న ఆటోను ఆపి తనిఖీ చేయగా, అందులో నిషేధిత గంజాయి లభ్యమైంది. పోలీసులు ఆటో డ్రైవర్ నూర్ సింగ్ (45), చింతగూడ తండాకు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని 1.907 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్