ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఏబీవీపీ 65 లక్షల మంది సభ్యత్వంతో పని చేయడం జరుగుతుందని సారంగాపూర్ మండల కన్వీనర్ లక్ష్మణ్ అన్నారు. మండల కేంద్రంలో గురువారం వివిధ కళాశాలలో పాఠశాలలో ఏబీవీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఏబీవీపీ ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. ఇందులో గణేష్, నరేష్, బన్నీ, సుబ్బు, వంశీ తదితరులున్నారు.