నిర్మల్ సోఫీ నగర్ దర్గాలో ఎమ్మెల్సీ ప్రార్థనలు
ప్రసిద్ధ సోఫి అహ్మద్ అలీ షా శుత్తారి వ ఖాద్రీ వారి దర్గాలో ఎమ్మెల్సీ మిర్జా రెహమత్ బేగ్ శుక్రవారం తెల్లవారుజామున ప్రార్థనలు చేశారు. నిర్మల్ లోని సోఫీ నగర్ ప్రాంతంలో ఉన్న ఈ దర్గా ఉర్సే షరీఫ్ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా దర్గా సజ్జాదే నషీన్ సోఫీ జిశాన్ అహ్మద్ పాష ఖాద్రీతో ఉర్సు ఉత్సవాల నిర్వహణ తీరుపై చర్చించారు. ఇందులో ఎంఐఎం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అజీం బిన్ యాహియా, మజహర్ లు ఉన్నారు.