అర్హులైన ప్రతి ఒక్కరు ఎమ్మెల్సీ ఓటు హక్కు కొరకు నమోదు చేసుకోవాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం నిర్మల్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పట్ట భద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రతీ ఒక్కరూ ఆదరించాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరు తమ ఎమ్మెల్సీ ఓటు హక్కు కొరకు నమోదు చేసుకోవాలని సూచించారు.