నిర్మల్ లో ఘనంగా మొల్లమాంబ జయంతి ఉత్సవాలు
నిర్మల్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ముందర మొల్లమాంబ జయంతి ఉత్సవాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. కుమ్మర ఉద్యోగుల సంక్షేమ సంఘం సేవా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలలో పలువురు ప్రసంగించారు. ఈ సందర్భంగా మొల్లమాంబ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కుమ్మర సంఘం జిల్లా అధ్యక్షులు కొత్తపెల్లి గంగాధర్ సేవా అధ్యక్షులు తోడిశెట్టి పరమేశ్వర్ లతోపాటు పలువురు పాల్గొన్నారు.