ముధోల్: సబ్ స్టేషన్ల నిర్మాణానికి నిధులు మంజూరు
ముధోల్ నియోజకవర్గంలోని కొల్లూరు, మహాగాం, పల్సీలలో విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి రూ. 7.50 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. వ్యవసాయ రంగం స్థానికులకు ఉన్న విద్యుత్ సమస్యలను తీర్చేందుకు ఈ నిధులు మంజూరు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ విషయమై పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు.