7న సోమవారం నిర్మల్ లో మొహరం ముగింపు
హస్సేన్ హుస్సేన్ త్యాగాలను స్మరించుకుంటూ ముస్లింలు అత్యంత బాధ తప్త హృదయాలతో నిర్వహించుకునే మొహరం ముగింపు ఈనెల 7న సోమవారం ఉంటుందని నిర్వాహకులు మీర్జా అప్సర్ బేగ్ తెలిపారు. పట్టణంలోని ఆయా వీధులలో ప్రతిష్టించిన పీరిల ఊరేగింపులు ఉంటాయన్నారు. ఉదయం ఆరు గంటలకు పెద్దపంజా పేరు శోభాయాత్ర పురవీధులలో ఉంటుందన్నారు. రాత్రి 9 గంటలకు నిమజ్జన శోభాయాత్ర ఉంటుందని చెప్పారు. పంజేషాగల్లి లో జాతర ఉంటుందన్నారు.