నల్గొండ: కన్జర్వేషన్ చట్టం మేరకు అనుమతులు తప్పనిసరి: కలెక్టర్
ఫారెస్ట్ కన్జర్వేషన్ చట్టం మేరకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో అభివృద్ధి పనుల నిర్వహణలో అటవీ భూముల వినియోగానికి సంబంధించి ఫారెస్ట్ కన్జర్వేషన్ చట్టం మేరకు సంబంధిత అధికారుల సలహా సూచనలతో మంగళవారం ముందుకెళ్లాలన్నారు. అటవీ భూములలో రోడ్లు విద్యుత్ స్తంభాలు ప్రాజెక్టులు పంచాయతీ భవనాల నిర్మాణాల కోసం పరివేష్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.