నర్సాపూర్ (జి): గ్రామపంచాయతీ తనిఖీ చేసిన డీఎల్పీవో
నర్సాపూర్ జి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో డీఎల్పీవో అజిజ్ ఖాన్ సోమవారం రికార్డులను తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన ఇంటి పన్నులకు సంబంధించిన రికార్డులను ఆయన తనిఖీ చేశారు. పంచాయతీకి సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలని కార్యదర్శి కైలాస రాథోడ్ కి తెలియజేశారు. పంచాయతీ పరిసరాల పరిశుభ్రతతో పాటు, కులాయి, ఇంటి పన్నులను వసూలు చేసుకోవాలన్నారు.