నర్సాపూర్ (జి): రాజీవ్ యువ వికాస్ వెబ్ సైట్ సర్వర్ డౌన్
రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు గడువు ఎల్లుండితో ముగియనుంది. శనివారం ఉదయం నుంచి వెబ్ సైట్ సర్వర్ డౌన్ అవుతుండటంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. వివరాలు నమోదు చేస్తుండగానే వెబ్సైట్ నిలిచిపోతోంది. దీంతో మళ్లీ మొదటినుంచి ప్రారంభించాల్సి వస్తోంది. సమస్యను పరిష్కరించాలని నిరుద్యోగులు కోరుతున్నారు. కాగా ఇప్పటి వరకు 390 దరఖాస్తులు వచ్చాయని జూనియర్ అసిస్టెంట్ భోజన్న తెలిపారు.