నర్సాపూర్ (జి): పంట పొలాలకు వెళ్లే రోడ్డులను కొలతలు చేసిన రెవెన్యూ అధికారులు

62చూసినవారు
నర్సాపూర్ (జి): పంట పొలాలకు వెళ్లే రోడ్డులను కొలతలు చేసిన రెవెన్యూ అధికారులు
నర్సాపూర్ (జి) మండలంలోని పాత గ్రామం నుండి నాసిరాబాద్ కట్ట వద్దకు వెళ్లే రోడ్డు కొందరు ఆక్రమించడంతో వ్యవసాయ రైతులకు దారి లేకుండా పోయింది. వారం రోజుల క్రితం గ్రామ రైతులు బ్రహ్మత్ నారాయణ్, మాడేగాం దేవన్న, గంగారంలు తాసిల్దార్ కార్యాలయంలో పంట పొలాలకు వెళ్లే దారిని కొందరు ఆక్రమించారని ఫిర్యాదు చేశారు. శనివారం మండల సర్వేయర్ గిర్ధవర్ వేణుగోపాల్ సిబ్బందితో కలిసి రోడ్డు కొలతలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్