నర్సాపూర్: 20న జరిగే సమ్మె నోటీసు అందజేత

84చూసినవారు
నర్సాపూర్: 20న జరిగే సమ్మె నోటీసు అందజేత
నర్సాపూర్ (జి)రాంపూర్ బీడీ ఫ్యాక్టరీలో టీయుసీఐ ఆధ్వర్యంలో బీడీ యాజమాన్యానికి గురువారం సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాజన్న మాట్లాడుతూ రాజ్యాంగం అమలులోకి వచ్చిన 78 సంవత్సరాల తర్వాత కూడా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు ముప్పు వాటిల్లుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. 20న జరిగే సమ్మెలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్