నర్సాపూర్: 1956లో స్థాపించిన బడిది
1956లో స్థాపించబడిన నర్సాపూర్ జి మండల కేంద్రంలోని (ZPSS) తన పూర్వ వైభవాన్ని కోల్పోతోంది. ఒకప్పుడు 1000కి పైగా విద్యార్థులతో కళకళలాడిన ఈ పాఠశాల నేడు సరైన భవనం లేక వెలవెలబోతోంది. ఈ పాఠశాల ఎందరో మహనీయులను అందించింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కూచిపూడి కళాకారుడు రాజారెడ్డి ఈ పాఠశాల పూర్వ విద్యార్థి కావడం విశేషం. అంతేకాదు, ఇక్కడ విద్యనభ్యసించిన వారే ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహించారు.