నిర్మల్: గ్రామపంచాయతీలలో వందశాతం ఆస్తి పన్ను వసూలు చేయాలి
పంచాయతీలలో వందశాతం ఇంటి పన్ను వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గ్రామీణ ప్రాంతాలలో వేసవిలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఆస్తిపన్ను విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేసిన సంబంధిత క్షేత్రస్థాయి సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.