నిర్మల్: పాత్రికేయుల పిల్లలకు 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలి
జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు స్కూళ్లలో 50 శాతం ఫీజు రాయితీ కోసం నిర్మల్ జిల్లా విద్యాధికారికి టీఎస్జేయూ అధ్యక్షుడు జవాన్ సుదర్శన్ సభ్యులు వినతిపత్రం శుక్రవారం అందజేశారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు స్కూళ్లలో 50 శాతం ఫీజు రాయితీ కల్పించాలని కోరారు. డీఈవో కూడా సానుకూలంగా స్పందించారు.