నిర్మల్: భూభారతి చట్టం పట్ల అవగాహన అత్యవసరం
భూభారతి చట్టంపై ప్రతి అధికారి పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన తెలంగాణ భూ భారతి (రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్) 20 25 చట్టంపై రెవెన్యూ అధికారులకు పరిపూర్ణమైన అవగాహన సదస్సు నిర్వహించారు. సందర్భంగా ఆమె మాట్లాడారు. ఇందులో అదనపు కలెక్టర్ రెవెన్యూ విభాగం కిషోర్ కుమార్, ఆర్డీవోలు రత్న కళ్యాణి కోమల్ రెడ్డిలు ఉన్నారు.