నిర్మల్: వక్ఫ్ బోర్డ్ బిల్లును రద్దు చేయాలని సిపిఐ ఆందోళన
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన వక్ఫ్ బోర్డు బిల్లును వెంటనే రద్దు చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో నిర్మల్ లో ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ చౌక్ లో నిరసన తెలిపారు. జిల్లా నాయకులు విలాస్. మాట్లాడుతూ కులాల, మతాల పేరిట విడదీసే ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేయడం సరికాదన్నారు. మైనార్టీల హక్కులను కాలరాసే రీతిలో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని దుయ్యబట్టారు.