నిర్మల్: అంధకారంలో చౌరస్తా

71చూసినవారు
నిర్మల్ పట్టణంలోని మంచిర్యాల చౌరస్తాలో అంధకారం నెలకొంది. పట్టణ సుందరీకరణ పనులలో భాగంగా చౌరస్తా మధ్యలో ఉన్న భారీ హైమాస్ట్ లైట్ల స్తంభాన్ని తొలగించారు. అదే ప్రదేశంలో చత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేసినా అధికారులు స్తంభాన్ని ఏర్పాటు చేయడం మరచిపోయారు. దీంతో పరిసరాలలో ఉన్న సాధారణ స్తంభాల ఉన్న వీధిదీపాలతోనే అంతంత మాత్రంగా వెలుగులు ఉంటాయి. తక్షణమే హైమాస్ట్ లైట్ల స్తంభాన్ని ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్