ఈనెల 5, 6, 7 తేదీలలో నిర్మల్ జిల్లా కేంద్రంలో చేపట్టే సాంస్కృతిక ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ సూచించారు. గురువారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా మాట్లాడారు. అన్ని శాఖల వారిగా స్టాళ్లు ఏర్పాటు చేసి మన జిల్లాకు ప్రత్యేక గుర్తింపు వచ్చేటట్లు చూడాలన్నారు.