నిర్మల్: జనావాసాల మధ్య ప్రమాదకరంగా భారీ వృక్షాలు

50చూసినవారు
నిర్మల్ లోని పలు జనావాసాల మధ్య కాలం చెల్లిన చెట్లు ప్రమాదకరంగా మారాయి. పాత పట్టణంలోని బంగల్ పేట, వెంకటాద్రిపేట్, బ్రాహ్మణ్ పురి, శేఖ్ సహాబ్ పేట్, ఇబ్రహీం బాగ్, సరత్ మహాల్, పంజేషాగల్లీలలో వందేళ్లు పైబడిన చెట్లున్నాయి. ఈదురు గాలులు వీచీనప్పుడు పై కొమ్మలు విరిగి రోడ్డుపై పడుతున్నాయి. రోడ్లకు ఇరువైపులా ఎండి పోయి ఉన్న భారీ వృక్షాలు ఎప్పుడు నేలకూలుతాయో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్