నిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉదయం డీసీసీ అధ్యక్షులు కుచాడి శ్రీ హరిరావు చేతుల మీదుగా ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సునీల్, ప్రధాన కార్యదర్శి బాలాజీ, కోశాధికారి రవికుమార్, కార్యనిర్వహక అధ్యక్షులు, శంకర్, ఉపాధ్యక్షులు బాపయ్య, ముత్యం, తదితరులు పాల్గొన్నారు.