నిర్మల్: అటవీ ప్రాంతాలలో అభివృద్ధి పనులను తక్షణమే చేపట్టాలి
అటవీ ప్రాంతాలలో అభివృద్ధి పనులను చేపట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఆర్ ఎఫ్ ఆర్ అమలుపై బుధవారం కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. అటవీ ప్రాంతాల అభివృద్ధి పనులను చేపట్టేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలన్నారు. ఇందులో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ఇతర శాఖల అధికారులు ఉన్నారు.