నిర్మల్ జిల్లా కేంద్రంలోని విశ్వేశ్వరయ్య భవన్లో శుక్రవారం తెలంగాణ పద్మశాలి ఇంజనీర్ల డైరీ, క్యాలెండర్ పద్మశాలి ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు మిట్టపల్లి మధుకర్, ప్రధాన కార్యదర్శి బూర ఉమాశంకర్ ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తాటిపాముల శంకరయ్య, రిటైర్డ్ ఇంజనీర్లు వడ్లకొండ వెంకటపతి, జల్ద గంగాధర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి బూర ఉమా శంకర్ మాట్లాడుతూ సంఘ పరంగా చేపట్టే వివిధ కార్యక్రమాల గురించి వివరించారు.